నవతెలంగాణ-హైదరాబాద్ : వీధి కుక్క దాడి చేయడంతో రేబిస్ బారినపడిన నాలుగేళ్ల బాలుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని వెల్లలూరు గ్రామానికి చెందిన తాడిశెట్టి రాజా, జ్యోతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజా వ్యవసాయ పనులు చేస్తుంటారు. సుమారు 15 రోజుల కిందట కుమారుడు కార్తీక్ ఇంటి బయట ఉండగా.. వీధి కుక్క బాలుడి తల, చేతులపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మూడు రోజుల తర్వాత బాలుడి ఆరోగ్యంలో మార్పులు రావడంతో విజయవాడలోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేశారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని అత్యవసర విభాగానికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు.
రేబిస్‌తో నాలుగేళ్ల బాలుడి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES