Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహణ 

లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహణ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో  ఝాన్సీ లింగాపూర్ డాక్టర్ లయన్ యాదగిరి సాహకారంతో శుక్రవారం ఝాన్సీ లింగాపూర్ ఆయుర్వేద హాస్పిటల్ నందు (నిజామాబాద్ వెళ్లే దారిలో) ఉచిత ఎముకల సాంద్రత పరీక్ష క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ.. మనిషి చూడడానికి ఆరోగ్యంగా ఉంటే సరిపోదు మనిషి లోపల ఉండే ఎముకల కాల్షియం హెచ్చుతగ్గులు తెలుసుకోవడం గురించి చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సుమారు 150 మందికి పైగా పరీక్షలు నిర్వహించామని అన్నారు. హైదరాబాద్ నుండి వచ్చి ఈ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ సెక్రటరీ లీడర్ శ్రీను, ట్రెజరర్ గోపి కృష్ణ,  జెంటిల్ కిడ్స్ గంగా ప్రకాష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -