Tuesday, November 4, 2025
E-PAPER
Homeకరీంనగర్హనుమాజీపేటలో ఉచిత వైద్య శిబిరం

హనుమాజీపేటలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట టీ.జీ.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్ బాయ్స్ హై స్కూల్‌లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ దివ్యశ్రీ విద్యార్థులను పరిశీలించి, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు తమ ఆరోగ్య స్థితి గురించి అవగాహన పెంపొందించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు గంగమరాజు, ఏఎన్ఎం తోపాటు సృజన, ఆశా కార్యకర్త ఉమా తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -