Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగ్లూర్ లో ఉచిత వైద్య శిబిరం

నాగ్లూర్ లో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని నాగ్లూర్ గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో  నగ్లూర్ గ్రామంలో ప్రత్యేక ఉచిత శిబిరం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యం అందించారు. అదేవిధంగా మందులు ఉచితంగా అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన వైద్యులకు వైద్య సిబ్బందికి గ్రామస్తుల తరఫున గ్రామ సర్పంచ్ సంతోష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగ్లూర్ సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ చక్రపాణి గౌడ్, వార్డు సభ్యులు సునీత భాయ్, ఉట్పల్లి గంగాధర్,  గొర్రె గంగాధర్ బావ్ సింగ్, జగన్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -