Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జన వికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

జన వికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : మండలంలోని అవుతాపురం గ్రామంలో జన వికాస ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొర్రూరు మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో, డాక్టర్ కోట నరేష్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన వికాస మెయిన్ కోఆర్డినేటర్ జె.‌ శైలజ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తారని, వారికి అవగాహన కల్పించేందుకు తరచూ జన వికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జన వికాస స్వచ్ఛంద సంస్థ గ్రామాల్లో కొనసాగిస్తున్న సేవాకార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీఆర్ఓ రాము మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జన వికాస ప్రతినిధులు సులోచన దేవి, సోమన్న, వైద్య సిబ్బంది రాధాకృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -