ప్రేక్షకుల ముందుకు శుక్రవారం ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం వచ్చింది. గత కొన్ని రోజులుగా పెయిడ్ ప్రీమియర్లతో జనాల్లోకి వెళ్లిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడం ఆనందంగా ఉందని మేకర్స్ తెలిపారు.
డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద నిర్మాత విజరు పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు.
మోహన్ శ్రీ వత్స ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సత్యరాజ్, ఉదయ భాను, వశిష్ట సింహా, క్రాంతి కిరణ్, సత్యం రాజేష్, సాంచీ రారు, మేఘన, కార్తికేయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సినిమాకి పాజిటివ్ స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ,’ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. ఆడపిల్ల ఉండే ప్రతీ ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమిది. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7) రాబోతోంది. ఈ క్రమంలో మా చిత్రాన్ని గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ప్రదర్శించే నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 30, 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రేపు (ఆగస్ట్ 30), ఎల్లుండి (ఆగస్ట్ 31) సాయంత్రం మొదటి ఆటకు వెళ్లే ఫ్యామిలీ ఆడియెన్స్‌లోని నలుగురు మెంబర్లలో తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలకు ఇలా ఇద్దరికి మాత్రం ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ సినిమా తాత, మవవరాలికి సంబంధించిన కథ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కదిలిస్తుండటంతో ఈ ఆఫర్‌ను అందిస్తున్నాం. ఈ కథ అంతా కూడా తాత, మనవరాలి చుట్టూనే తిరుగుతూ సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుంది’ అని తెలిపారు.
నిర్మాత విజరు పాల్‌రెడ్డి మాట్లాడుతూ,’ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. వారి ప్రశంసలు మా కష్టాన్ని మరచిపోయేలా చేశాయి. తాత, మనవరాలి చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే మా చిత్రాన్ని గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా చూపించాలన్ని సంకల్పించాం. మా సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి పాజిటీవ్ ఫీడ్ వస్తోంది. ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో మా తదుపరి చిత్రం ‘బ్యూటీ’ని మరింత ముస్తాబు చేసి, రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.
గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచిత ప్రదర్శన
- Advertisement -
- Advertisement -