Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంమైనారిటీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉపాధి

మైనారిటీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఉపాధి

- Advertisement -

– మైనారిటీ జిల్లా అద్యక్షులు ఎండి.యాకూబ్ పాషా 
నవతెలంగాణ – పాల్వంచ 

మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ వారు నిరుద్యోగ మైనారిటీ యువతకు‌ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్విస్, ఇన్స్యూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ లేదా పిజీలలో  50శాతం మార్కుల అర్హత కలిగి ఉండి, 26 సం.ల లోపు వయస్సు కలిగి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులని‌ పేర్కొన్నారు. ‌ ఆసక్తి గల ముస్లీం, క్రైస్తవులు, సిక్కులు, జైన్, పార్శీలు, భౌద్ద  అభ్యర్థులు ఆగస్ట్ 18వ తేదీ లోపు తమ‌ దరఖాస్తులను హైద్రాబాద్ మైనారిటీ సర్కిల్ కార్యాలయంలో లేదా జిల్లాలలో గల మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు 8520860785, 040 23236112 లలో సంప్రదించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad