నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం బొమ్మనివాడ లో మంగళవారం ఉదయం 8 గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, పశు సంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరంను నిర్వహించినట్లు అదికారులు తెలిపారు. ఈ శిబిరంలో పశువుల వ్యాధుల నిర్ధారణ, అవసరమైన వైద్య పరీక్షలు జరిపి, ఉచిత మందులు, టీకాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా ముద్ద చర్మవ్యాధి, కీటక వ్యాధులు, పాల ఉత్పత్తి తగ్గించే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యులు రైతులకు అవగాహన కల్పించారు.
పశువుల పోషణలో శానిటేషన్, సమయానికి టీకాలు, పచ్చికమేత ప్రాముఖ్యతపై రైతులకు సూచనలు అందజేశారు. శిబిరానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పశువులకు వైద్య సేవలు పొందారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ – “ఇలాంటి శిబిరాలు తరచుగా నిర్వహిస్తే పశువుల ఆరోగ్య సమస్యలు తక్కువవుతాయి.అని అభిప్రాయపడ్డారు.కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంత కానీ తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ – “రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం, పశువుల ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.
ప్రతి గ్రామానికి ఇలాంటి సేవలు అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి” అని వెల్లడించారు.గ్రామస్థులు, రైతులు ఈ శిబిరాన్ని అభినందిస్తూ, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ మార్కెట్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ పశువైద్య శిబిరంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుమల -సమ్మయ్య, వైస్ చైర్మన్ చినాల బ్రహ్మ రెడ్డి, మార్కెట్మం కమిటీ డైరెక్టర్డ పిల్లమరి రమేష్ల, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరి కుమార్, పశువైద్యాధికారి డాక్టర్ రమేష్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.