ఏకే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్ పారు’. ఈ చిత్రంలో సింగర్ కాలభైరవ పాడిన ‘నా ప్రాణమంత..’ అనే పాటను శనివారం డైరెక్టర్ కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. ఆదిత్య మ్యూజిక్‌లో విడుదలైన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ,’ఈ మూవీ ఒక ఫ్రెష్ ఎమోషనల్ లవ్ స్టోరీ. యూత్‌ను ఆకట్టుకుంటుంది. పాట కూడా చాలా బాగుంది. ‘ అని అన్నారు. ‘కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే తపన ఈ చిత్రంతో నెరవేరింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ కాలభైరవ పాట పాడడం విశేషం. ఆయన పాట, లిరిక్స్, మ్యూజిక్ అన్నీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
సినిమాలోని లవ్ స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ..యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి’ అని ప్రొడ్యూసర్ అలీఖాన్ చెప్పారు. హీరో మిహాస్ రోమి మాట్లాడుతూ, ‘ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు మంచి పేరు వస్తుంది. మా టీమ్ ప్యాషన్, ప్రొడ్యూసర్ అలీ, డైరెక్టర్ అఖిల్, డీఓపీ అశ్విన్ సపోర్ట్‌తో ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని భావిస్తున్నాను’ అని తెలిపారు. దర్శకుడు అఖిల్ రాజు మాట్లాడుతూ, ‘నా సినీ ప్రయాణంలో మెగాస్టార్ ప్రేరణ ఎంతో ఉంది’ అని అన్నారు. ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియ చెప్పారు.
ఫ్రెష్ ఎమోషనల్ లవ్‌స్టోరీ
- Advertisement -
- Advertisement -



