Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ అభినందనీయం

ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ అభినందనీయం

- Advertisement -

– హుస్నాబాద్  ఎస్ ఐ లక్ష్మారెడ్డి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

స్నేహితుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ లో ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం అభినందనీయమని హుస్నాబాద్ ఎస్ ఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ క్రికెట్ క్లబ్ (హెచ్ సిసి) ఆధ్వర్యంలో వన్ డే ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన ఎస్ ఐ లక్ష్మారెడ్డి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవ సందర్భంగా స్నేహితులందరూ  క్రీడలు ఆడడం సంతోషకరమన్నారు.

ఈ ఫ్రెండ్షిప్ క్రికెట్ మ్యాచ్ లో సీనియర్, జూనియర్ జట్లు పాల్గొన్నాయి. జూనియర్ జట్టు విజేతగా నిలువగా సీనియర్ జట్టు రన్నర్ ఆఫ్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జూనియర్స్ 15 ఓవర్లలో 159 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన సీనియర్స్ టీమ్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమి చెందారు. ఈ కార్యక్రమంలో మ్యాచ్ నిర్వాహకులు దొడ్ల శ్రీధర్ రెడ్డి, కవ్వ శ్రవణ్, దిలీప్  ఎగురి రవీందర్ రెడ్డి, శ్రీకాంత్, వంశీ  అంపైర్లుగా జాల శ్రీనివాస్, మహేష్, కామెంటార్ గా శేఖర్  ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -