Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇక నుంచి 2 నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం

ఇక నుంచి 2 నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం

- Advertisement -

– ఆధార్‌ నెంబర్‌ చెప్తే చాలు ..
హైదరాబాద్‌ :
కులం సర్టిఫికెట్‌ ఇక నుంచి కేవలం రెండు నిమిషాల్లోనే పొందనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఉన్న కుల ధ్రువీకరణ పత్రాన్ని కొత్తదిగా తీసుకోవాలంటే రోజులు తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. కేవలం రెండు నిమిషాల్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు. మరి అది ఎలా అప్లై చేయాలి? ఎంత రుసుము చెల్లించాలి? ఏయే సర్టిఫికెట్లు కావాలో ఇప్పుడు చూద్దాం.
ఈ విధానం వారికి మాత్రం వర్తించదు
కుల ధ్రువీకరణ పత్రాన్ని త్వరగా పొందడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కేవలం రెండు నిమిషాల్లో అందించేలా మార్పు చేసింది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని, మళ్లీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి ప్రస్తుతం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీసేవా కేంద్రాల్లో ఆధార్‌ నంబర్‌ ద్వారా రెండు నిమిషాల్లో తీసుకోవచ్చని ఈడీఎం దేవేందర్‌ తెలిపారు. కులం మారదు కనుక అవసరం ఉన్నవారు నేరుగా మీసేవా కేంద్రానికి వెళ్లి రూ.45 రుసుం చెల్లించి ఆధార్‌ నెంబర్‌ చెప్తే వారు సర్టిఫికెట్‌ను ఇస్తారు. అందుకు వారు ఇదివరకే కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని ఉండాలి. కానీ ఈ విధానం ఎస్సీ హిందూ సామాజిక వర్గానికి మాత్రం వర్తించదని పేర్కొన్నారు.
ఇక నుంచి ఈ సేవలన్నీ మీ-సేవలో
మీ-సేవ పరిధిలో కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల సౌకర్యార్థం కోసం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ప్రయివేటు సైట్‌లోనే అందుబాటులోనే ఉండగా, ప్రస్తుతం వీటని ప్రభుత్వం మీసేవా పరిధిలోకి తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ, అటవీ, సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి గ్యాప్‌ సర్టిఫికేట్‌, పౌరుని పేరు మార్పు, స్థానికత, మైనార్టీ, క్రిమిలేయర్‌, నాన్‌ క్రిమిలేయర్‌, సీనియర్‌ సిటిజన్‌ మెయింటెనెన్స్‌, మానిటరింగ్‌, వన్యప్రాణుల దాడిలో పరిహారం, సామిల్‌, టింబర్‌ డిపో, తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు హిందూ మ్యారేజ్‌ సర్టిఫికేట్‌, నాన్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ వాల్యూవ్‌? సర్టిఫికెట్‌ , పాన్‌ కార్డు సవరణ, ఇసుక బుకింగ్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినట్టు ఈడీఎం తెలిపారు.
ఆ సమస్యలన్నింటికి చెక్‌
ఇది కులం సర్టిఫికెట్‌ ఉన్నదాన్ని కొత్తగా మార్చుకునేందుకు సుమారు వారం నుంచి 15 రోజులు పడేది. దానికి అప్లికేషన్‌ ఫారమ్‌, ఆధార్‌ కార్డు, సంగం సర్టిఫికెట్‌, కులం సర్టిఫికెట్‌? (పాతది), రేషన్‌ కార్డు ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చేది. దానికి అఫిడవిట్‌ చేయించాలి. అవన్నీ తీసుకుని మీసేవాకి వెళ్లి చలాన్‌ కట్టి అప్లై చేస్తే వారం నుంచి 15రోజుల్లో కులం సర్టిఫికెట్‌ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నింటీకి చెక్‌ పడింది. మొదటిసారి కుల ధ్రువీకరణ పత్రం ప్రింట్‌ తీసుకున్నప్పుడు దానిపై మీసేవా నంబర్‌ ఉంటుంది. మరోసారి కావాలి అనుకుంటే ఆధార్‌ నంబర్‌తో కొత్తగా తీసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -