ఇతర మార్గాల గుండా బయటకు వెళ్లొచ్చు: ట్రాఫిక్ సిఐ ప్రసాద్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని రమేష్ థియేటర్ చౌరస్తా నుంచి మాత్రమే ఖలీల్ వాడి లోకి మాత్రమే (ప్రవేశం) వెళ్లాలని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ సూచనలతో ఖలీల్ వాడిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులు ఎలాంటి ఆశోకారాలు కలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా ఖలీల్ వాడిలో వచ్చే ప్రజలు రమేష్ థియేటర్ చౌరస్తా నుంచి మాత్రమే లోపలికి రావాలని బయటకు వెళ్లాలంటే ఇతర మార్గాల గుండా బయటకు వెళ్లాలని సూచించారు.
అందుకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ప్రజలు వెళ్లే మార్గాలలో రూట్ మ్యాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూట్ మ్యాప్ ఆధారంగా ఎలా లోపలికి వెళ్ళాలి ఎలా బయటకు వెళ్లాలి అనేది కూడా సూచిస్తామన్నారు. కావున వాహనదారులు ప్రజలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ లలో వినియోగించుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించగలరని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. వాహనాదారులు తమ ఇష్టం వచ్చినట్లు వాహనాలను లోపలికి వచ్చి ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ వినోద్, ఎస్సైలు, ఏఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
రమేష్ థియేటర్ చౌరస్తా నుంచి ఖలీల్ వాడికి వెళ్లాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES