Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసాఫ్ట్‌వేర్‌ టూ సర్పంచ్‌

సాఫ్ట్‌వేర్‌ టూ సర్పంచ్‌

- Advertisement -

గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవం

నవతెలంగాణ-నారాయణఖేడ్‌ రూరల్‌
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలన్న తపనతో తనవంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ యువకునికి.. ఆ గ్రామస్తులు పట్టం కట్టారు. ఇటీవల జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం పలుగు తండాకు చెందిన నేనావత్‌ కిషన్‌ నాయక్‌. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తూన్న కిషన్‌ నాయక్‌ గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఐదేండ్లుగా నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యపై అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తండాలోని ప్రజలు కనీసం మురుగు కాలువ లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఆ సమస్యను కిషన్‌నాయక్‌ పరిష్కరించారు.

ఏడేండ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసినా కలగని సంతృప్తి.. గ్రామం కోసం పని చేస్తుంటే కలుగుతోందని ఈ సందర్భంగా కిషన్‌ తెలిపారు. పలుగు తండా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజలు ఆ నమ్మకంతో నన్ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఏకగ్రీవం అనేది ప్రజలు ఇచ్చిన బహుమతి అని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో తన సొంత డబ్బులతో కిషన్‌ నాయక్‌ బోర్‌ రిపేరింగ్‌ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట్స్‌ బుక్కులు, పెన్నులు, పుస్తకాలు, వాటర్‌ బాటిల్స్‌ అందించేవారు. అంతేకాక విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో తండావాసులు సర్పంచ్‌గా ఆయన్ను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -