Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ

అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ

- Advertisement -

– భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
– పది మృతదేహాలకు పురానాపూల్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

నగరంలోని పాతబస్తీ గుల్జర్‌ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన 17 మందిలో 10 మంది మృతదేహాలకు పోస్టుమా ర్టం నిర్వహించిన అనంతరం అత్తాపూర్‌లోని సన్రైస్‌ విల్లాలోని కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం భారీగా జరగడం విచారకరమని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి సహాయక చర్యలకు ఆదేశించినట్టు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల అర్తనాదాలను వర్ణంచలేమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, మాజీ హౌం మంత్రి మహమూద్‌ అలీ, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు కూడా బాధితులను పరామర్శించి, మృతులకు సంతాపం తెలిపారు. అనంతరం సాయంత్రం పది మృతదేహాలకు పాతబస ీ్తలోని పురానాపూల్‌ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad