Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు

బీసీ రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఈనెల 18 తలపెట్టిన బీసీ బంద్ బంద్ ఫర్ జస్టీస్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని గంజు వర్తక గుమాస్తా సంఘం దడ్వాయి సంఘం, హమాలీ సంఘం, చాటా సంఘం అన్ని సంఘాల ఉమ్మడి కార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదల్చిన 42 శాతం రిజర్వేషన్లను కొందరు కోర్టులో కేసు వేసి నిలిపివేయడంతో ఈనెల రాష్ట్ర బంద్ కు 

బీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ బంద్ బంద్ ఫర్ జస్టిస్ కు సహకరించమని నిజామాబాదులోని గంజ్ వర్తక గుమాస్తా హమాలీ తడవాయి చాట సంఘం యొక్క ఉమ్మడి కార్యకరణ కమిటీ సభ్యులను కలిసి వారి సహకారం కోరడం జరిగింది. గురువారం నిజామాబాద్ గంజిలోని వర్తక గుమాస్తా కార్యాలయంలో అన్ని సంఘాల ఉమ్మడికారీస్ అన్న కమిటీ వాళ్లు సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీ సంఘాల నాయకులను పిలిపించుకొని స్వచ్ఛందంగా వారి బద్దత్తు తెలపడం హర్షనీయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నాడు.

ఈ పోరాటం న్యాయ పోరాటమని దీనికి అన్ని వర్గాల సహకారాలు స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషకరమని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్ల్ అధ్యక్షుడు నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు దర్శనం దేవేందర్, కొయ్యడ శంకర్, చంద్రకాంత్, బాలన్న, చైతన్య,గంజు వర్తక గుమస్తా, దడ్వాయి, హమాలీ, చాట, సంఘం యొక్క ఉమ్మడి కార్యచరణ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, బాల ఆంజనేయులు, గట్ల శ్రీనివాస్, పరశురాం, శ్రీహరి, వెంకటేష్, ప్రవీణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -