– ప్రైమ్ వాలీబాలీ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
– అక్టోబర్ 2 నుంచి హైదరాబాద్‌లో పీవీఎల్ సీజన్ 4
నవతెలంగాణ-హైదరాబాద్ :
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్ పోటీలకు హైదరాబాద్ వేదిక కావటం సంతోషకరం. క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తుందని, ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీలను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4 పోస్టర్‌ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ శివసేనా రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ‘హైదరాబాద్‌లో పీవీఎల్ నిర్వమణకు ప్రభుత్వం అండగా నిలిచి, భరోసా ఇవ్వటం సంతోషంగా ఉంది. అక్టోబర్ 2 నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రైమ్‌వాలీబాల్ లీగ్ పోటీలు జరుగుతాయి. పీవీఎల్ ఫైనల్ సహా 38 మ్యాచులు ఇక్కడే జరుగుతాయని’ అని హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు.