Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకార్మికులకు నిధులు, నియామకాలు పెంచాలి

కార్మికులకు నిధులు, నియామకాలు పెంచాలి

- Advertisement -

73వ షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రకారం కేటాయించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-మెదక్‌ టౌన్‌

గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్మికులకు 73వ షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రకారం నిధులు, నియామకాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం మెదక్‌ పట్టణంలోని టీఎన్జీవో భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కార్మికులకు గతేడాది నుంచి సబ్బులు, నూనెలు, గ్లౌజ్‌లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. అదనపు పనులు చేయిస్తున్నా.. దానికి అదనపు వేతనం మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. 73వ షెడ్యూల్‌లో 68 రకాల జిఓలను సవరించడం లేదన్నారు. 15 ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం 21, 22, 25 జీఓలను గెజిట్‌ చేయడం లేదని విమర్శించారు. దీంతో కార్మికులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారని తెలిపారు. కాంటాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, డైలీ వేజ్‌ పేర్లతో నియామకాలు చేపడుతూ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. మున్సిపల్‌, గ్రామపంచా యతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంద న్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 73వ షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రకారం 68 రకాల జీఓలను సవరించి, కార్మికులకు నిధుల కేటా యింపు, నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ జిల్లాలో డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర మహాసభ నిర్వహించనుండటంపై జిల్లా నాయకత్వాన్ని అభినందించారు. గ్రామపంచా యతీ, మున్సిపల్‌ కార్మికుల సమస్యల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర మహాసభలో భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించేందుకు మెదక్‌ జిల్లా వేదిక కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో గ్రామపంచాయతీ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌, సీఐటీయూ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.అడివయ్య, సీఐటీయూ మెదక్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, ఎ.మల్లేశం, జిల్లా కోశాధి కారి నర్సమ్మ, నాయకులు సంతోష్‌, కె.మల్లేశం, అజరు, గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఆసిఫ్‌, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad