Sunday, August 3, 2025
E-PAPER
Homeఖమ్మంరహదారి పునరుద్దరణకు నిధులు మంజూరు..

రహదారి పునరుద్దరణకు నిధులు మంజూరు..

- Advertisement -

పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారె…
నవతెలంగాణ – అశ్వారావుపేట

సెంట్రల్ లైటింగ్,డ్రైనేజీ నిర్మాణం,రహదారి నిర్మాణం పనులకు అదనంగా రహదారి పునరుద్దరణ, వెడల్పు పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం ప్రారంభించారు.  ఖమ్మం – దేవరపల్లి రాష్ట్ర రహదారిలో అశ్వారావుపేట సమీపంలో గతంలో 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది.పైగా ప్రస్తుతం సెంట్రల్ లైటింగ్ పనుల్లో ఘోరంగా ధ్వంసం అయింది.

ఈ క్రమంలో 7 మీటర్ల నుండి 8.75 మీటర్ల వెడల్పున విస్తరిస్తూ స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపగా గత నెల జులై 30 న ఆర్ అండ్ బి శాఖ రూ.10 కోట్లు రివైజడ్ టెక్నికల్ అడ్మిన్స్ట్రేటివ్ అనుమతులు మంజూరి చేసింది. దీంతో వీకేడీఎస్ కళాశాల నుండి ఆంజనేయ టెంపుల్ వరకు సుమారు 200 మీటర్లు రోడ్డు ను వెడల్పు చేస్తారు.

ఇక్కడ నుండి ప్రధాన కూడలి వరకు రెండు వైపులా విస్తరణ,అభివృద్ది చేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ డీఈఈ ప్రకాశ్,కాంట్రాక్టర్ అప్పారావు,నాయకులు తుమ్మ రాంబాబు,జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్రరావు, నార్లపాటి రాములు,మిండ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -