Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు పత్రాలను మంగళవారం అందజేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక బిజెపి నాయకులు ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తన ఎంపీ లాండ్స్ నిధుల నుండి ఒక్కో పాఠశాలకు రూ.2లక్షల చొప్పున నిధులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నిధుల మంజూరు( ప్రొసీడింగ్ కాపీలను ) పత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్యకు బిజెపి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఎంపీ ల్యాండ్స్ నిధుల మంజూరుకు సహకరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి ప్రధానోపాధ్యాయులు ఆంధ్రయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సున్నం మోహన్,  బీజేవైఎం మండల అధ్యక్షులు కొత్తపల్లి గణేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిట్యాల దేవేందర్, కిషన్ మోర్చా అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి, చౌట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు సతీష్, శక్తి కేంద్రా ఇంచార్జ్ మహేష్, బిజెపి నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img