Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూ.కాలేజ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

ప్రభుత్వ జూ.కాలేజ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మత్తు అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ పాండురాంగ్ మంగళవారం విలేకరులకు తెలిపారు. మొత్తం రూ.36 లక్షల 50 వేల నిధులు ప్రతిపాదన రాగా.. వీటిలో ప్రస్తుతం రూ.9 లక్షల 12 వేల నిధులు విడుదలై కళాశాల అకౌంట్లో జమ అయినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల అభివృద్ధి మరమ్మత్తుల పనుల కోసం టెండర్లు పిలవవలసి ఉందని టెండర్లు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరగవలసి ఉన్నాయని తెలిపారు. దాదాపు 25 శాతం నిధులు విడుదలై నాలుగు మాసాలు అవుతున్నప్పటికీ టెండర్లు పిలవడంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉందని, టెండర్లు పూర్తి అవుతే కళాశాల అభివృద్ధి పనులు జరుగుతాయని కళాశాలలో గదుల మరమ్మతులు కరెంటు వైర్లు ఫ్యాన్లు మరుగుదొడ్లు మూత్రశాలలు ఫ్లోరింగ్ గదుల తలుపులు, కిడికిలు క్లాస్ రూముల్లో బోర్డులు తదితర రిపేరు అభివృద్ధి పనులు జరగవలసి ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. నిధులు విడుదలైన వాటి పనులు వెంటనే చేపట్టాలని కళాశాల విద్యార్థిని విద్యార్థులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -