స్థల పరిశీలనకు వచ్చిన అధికారులు
నవతెలంగాణ – మద్నూర్
బుధవారం మద్నూర్ మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మండలంలోని పెద్ద ఎక్లారా గేట్ వద్ద గల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.2 లక్షలు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాల మేరకు గురువారం మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, పంచాయతీ రాజ్ ఏఈఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ మండల అధికారులతో కలిసి పరిశీలించారు.
హాస్టల్ మెస్ వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యార్థులకు నీటి కొరత రాకుండా బోర్ వెల్ ఏర్పాటు, హాస్టల్ భద్రత సిబ్బంది కొరకు రూమ్ నిర్మాణం చేయుట వంటి పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు.