- స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలి : రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మోడ్రన్ ధోబీఘాట్లకు నిధులను కేటాయించాలని తెలంగాణ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. ఈ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం అధ్యక్షులు ఏదునూరి మాదారు అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డెకరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పన- వృత్తుల ఆధునీకరణకు నిధులు కేటాయిస్తామని ప్రతి జిల్లాలోనూ రూ.10 కోట్లతో మోడ్రన్ ధోబీ ఘాట్లు నిర్మిస్తామని, వృత్తిదారులందరికీ రూ.10 లక్షలతో ఆర్థిక సహకార పథకం అందిస్తామని,పెన్షన్, రక్షణ చట్టం, రజక ఫెడరేషన్‌కు పాలకవర్గం తదితర హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం మేర వెంటనే అమలు చేసి, ఏ,బి,సి,డి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ బిల్లు వర్గీకరణ ఊసే లేకపోవటం అన్యాయమని పేర్కొన్నారు. ఈనెల 8న విద్యుత్ ఉద్యమం అమరుడు సత్తెనపల్లి రామకష్ణ 25వ వర్థంతి, వీర వనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి, 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ కమిటీల్లో ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు