పలు ప్రాంతాలకు బస్సులను కేటాయించాలి..
రోడ్డు రవాణా మంత్రి పొన్నం ను కలిసిన ఎమ్మెల్యే కుంభం..
నవతెలంగాణ – భువనగిరి
జిల్లా కేంద్రమైన భువనగిరిలో అధునాతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, విద్యార్థులకు, ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా నూతన బస్సులను ఆయా ప్రాంతాల కేటాయించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రజల రాకపోకలు పెరిగినాయని దీంతో బస్సుల రద్దీ పెరిగింది అన్నారు. సరిపోను బస్సులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కేంద్రానికి తప్పనిసరిగా వివిధ పనుల నిమిత్తం రావాల్సి ఉంటుందని దీంతో ఆయా ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి యాదాద్రి భువనగిరి జిల్లాకు నిధులు బస్సుల కేటాయింపు పై తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
బస్టాండ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES