Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్తు తరాలకు ఫ్యూచర్‌ సిటీ

భవిష్యత్తు తరాలకు ఫ్యూచర్‌ సిటీ

- Advertisement -

ఈ నెల 8,9 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
పనులు పరిశీలన

నవతెలంగాణ-కందుకూరు
భవిష్యత్తు తరాలకు ఫ్యూచర్‌ సిటీని అందించడంతోపాటు మెరుగైన అభివృద్ధి కోసమే గ్లోబల్‌ సబ్మిట్‌ను నిర్వహిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు వచ్చే అతిథులకు ఏర్పాటు చేసిన స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు, ఏర్పాట్లు, చేయాల్సిన పనులు, తదితర ఆంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు మంత్రి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ విదేశాల నుంచి వచ్చే వీవీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.

అధికారులు ఎప్పటికప్పుగు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభానికి సమయం తక్కువగా ఉన్నందున అన్ని రకాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరానికి సరిపడా సిబ్బందిని సైతం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫోర్త్‌ సిటీ ఇన్‌చార్జి, కమిషనర్‌ శశాంక్‌, ఎమ్మెల్యే మాల్‌రెడ్డి రంగారెడ్డి, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ గోపాల్‌, టీపీసీసీ కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -