– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవ తెలంగాణ – హైదరాబాద్
ఫ్యూచర్ సిటీ తెలంగాణకు గేమ్ చేంజర్ అని, మూసి పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందనిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీ)లో రమా హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ”ఇది ప్రజల ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్, ఉన్నతాధికారులను పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి,” అని భట్టి తెలిపారు. పెండింగ్ పవర్ బిల్లుల వన్-టైమ్ సెటిల్మెంట్‌పై ప్రభుత్వం ఆలోచిస్తోందని, పరిశ్రమలు, పౌర సమాజం కలిసి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంపద చేర్చాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టి కేవలం సాధనమని, ప్రజల గౌరవం, ఆశయాల నెరవేర్పే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఎఫ్‌టీసీసీఐ వందేండ్ల అనుభవంతో హైదరాబాద్‌ను వర్తక నగరం నుంచి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేలా చేసిందని కొనియాడారు.
ఫ్యూచర్ సిటీ తెలంగాణకు గేమ్ చేంజర్
- Advertisement -
- Advertisement -