- Advertisement -
నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిట్ల సాయిబాబా, మాజీ ఎంపిటిసి వెంకట్, మాజీ ఉప సర్పంచ్ ఇంద్ర గౌడ్, కపర్తి రవి, కాశీరాం పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
- Advertisement -