Saturday, March 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగద్దర్‌ అవార్డ్‌ నగదు విరాళంగా..

గద్దర్‌ అవార్డ్‌ నగదు విరాళంగా..

- Advertisement -

‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రస్తుతం పలు ఆసక్తి కరమైన ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న చిరంజీవి తన తనయుడు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా ఎన్టీఆర్‌ అవార్డుతో పాటు పది లక్షల నగదు బహుమతి అందుకున్న చిరంజీవి, ఆ మొత్తాన్ని తన చిరకాల సామాజిక సంక్షేమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వారి దైనందిన అవసరాలకు మద్దతుగా చిరంజీవి ‘సర్వ్‌ ఫౌండేషన్‌’కు విరాళం అందించారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రీకరణ సమయంలో రామ్‌ చరణ్‌ను కలిసిన వృద్ధులు ఆయన పుట్టినరోజును జరుపుకోవాలని ఆశపడగా, చిరంజీవి ఆ కోరికను నెరవేర్చారు.

30 మంది వృద్ధులను బ్లడ్‌ బ్యాంక్‌కు ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు ఇచ్చి, ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగాజరిగింది. ‘దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌’, ‘వాల్మీకి ఫౌండేషన్‌’, ‘నయశ్రీ ఫౌండేషన్‌’లకు చిరంజీవి సహాయం అందించారు. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్సకు ప్రత్యేకంగా సహాయపడటానికి చిరంజీవి బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి విరాళం అందించారు. తన కుటుంబ వేడుకను సమాజానికి ఉపయోగపడేలా చేయాలని చిరంజీవి సంకల్పించడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -