Saturday, July 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగద్వాల పత్తి విత్తన రైతులకు న్యాయం చేయాలి

గద్వాల పత్తి విత్తన రైతులకు న్యాయం చేయాలి

- Advertisement -

– వ్యవసాయశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌కు రైతు, గిరిజన సంఘాల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

గద్వాల జిల్లాలో పత్తి విత్తనాలు సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరాం నాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, నాయకులు వెంకటస్వామి, నర్సింహ్మ, మల్లేష్‌, వీరేశ్‌, నారాయణ, తిమ్మప్ప, వీరన్న తదితరులు ఉన్నారు. అనంతరం సాగర్‌ మాట్లాడుతూ 40 వేల ఎకరాల్లో విత్తన రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి, రైతులకు ఎకరానికి ఇచ్చే పెట్టుబడి సహాయం లక్ష రూపాయలు కంపెనీల నుంచి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ‘గద్వాల జిల్లాలో రైతులు 25 ఏండ్ల నుంచి పత్తి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు. 25 వేల మంది రైతులు 40వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. సుమారు 16 కంపెనీలు (మధ్యవర్తులు) ఆర్గనైజర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి సంవత్సరం బీటీ, నాన్‌ బీటీ విత్తనాలు ఆర్గనైజర్‌ ద్వారా రైతులకు ఇచ్చి ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ ఏడాది కూడా 40 వేల ఎకరాలకు విత్తనాలు ఇచ్చారు. రైతులు పంట సాగు చేశారు. కానీ కొనేటప్పుడు కంపెనీలు, ఆర్గనైజర్స్‌ ఎకరానికి 2 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తాం. పెట్టుబడి సాయం ఇవ్వం’ అని అంటున్నాయని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేసి రైతులు పండించిన మొత్తం పంటలు కంపెనీలు కొనుగోలు చేసి పెట్టుబడి సాయం కింద లక్ష రూపాయలు రైతులకు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
డిమాండ్లు
రైతులు పండించిన పంటలు మొత్తం కొనుగోలు చేయాలి.
ప్యాకెట్‌ ధర రూ.800 చెల్లించాలి.
కంపెనీ, రైతుల మధ్య ఒప్పందం ఉండాలి.
పంటలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి.
ఎకరాకు వడ్డీలేని రుణాలు రూ.2 లక్షలు ఇవ్వాలి.
జిన్నింగ్‌ ఖర్చులు కంపెనీలే భరించాలి.
రైతులు పంట ఇచ్చిన వెంటనే డబ్బులు చెల్లించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -