నవతెలంగాణ- గజ్వేల్
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను సందర్షించి అక్కడి రైతులతో మాట్లాడడం జరిగింది. ఎరువుల గోదాంలను కూడ పరిశీలించడం జరిగింది. గజ్వేల్ లో ఎరువుల కొరత లేదు అది ప్రతిపక్షాల అభూత కల్పన , వాస్తవానికి యూరియా ఎరువుల పంపిణీ కేంద్ర ప్రభుత్వానిది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందు చూపుతొ రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలతో పోల్చుకుంటె గజ్వేల్ లో రైతులకు సరిపడా ఎరువుల ను నిల్వ ఉండే విధంగా నాయకులు ప్రతి రోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో సమన్వయ పరుస్తు రైతులకు ఇబ్బందులు కలగకుండా నర్సారెడ్డి కృషి చేస్తున్నారు.
అలాగే రైతులు యూరియా తోపాటు నానో యూరియా ను కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గజ్వేల్ లో రూపాయికి కూడ పనికి రాని ప్రతిపక్షాలు- రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వారి మాయలో పడొద్దు అని మనవి, ప్రతిపక్ష నాయకుడు కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్న తీరును గజ్వేల్ ప్రజలు గమనిస్తున్నారు నిజంగా అ నాయకులకు ప్రజలపై, రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటె ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న, ఎమ్మెల్యే ప్రజల సొమ్ము తో జీతం తీసుకుంటు ,ప్రజలకు సేవ చేయకుండ కేవలం ఫామ్ హౌజ్ లొ పండుకున్న ఎమ్మెల్యే ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గజ్వేల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గజ్వేల్ లో ఎమ్మెల్యే పనిచేయించాలని అ నాయకులకు విజ్నప్తి చేస్తున్నాము ,లేని యెడల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లొ మిమ్మల్ని ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ ,సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కర్ణాకర్ రెడ్డి, అక్కారం యాదగిరి, నర్సింహారెడ్డి, కొండపోశమ్మ డైరెక్టర్ గుండులక్మణ్, నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, కొండల్ రెడ్డి, జహీర్, డప్పుగణెష్, దాతర్ పల్లి లక్ష్మణ్, ప్రెజ్నాపూర్ శివులు, క్యాసరం మల్లారెడ్డి, అరుణ్ కుమార్, హషన్ బాయ్, తదితరులు పాల్గొన్నారు.