No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమాదుబాయ్‌లో వైభవంగా 'గామా' వేడుక

దుబాయ్‌లో వైభవంగా ‘గామా’ వేడుక

- Advertisement -

‘గామా’ (గల్ఫ్‌ అకాడమీ మూవీ అవార్డ్స్‌)కు టాలీవుడ్‌లో ఓ స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఇప్పుడు 5వ ఎడిషన్‌ వేడుకలు ఈనెల 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ అవార్డ్స్‌ కార్యక్రమానికి టైటిల్స్‌ స్పాన్సర్‌గా వైభవ్‌ జ్యువెలర్స్‌ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహిం చిన కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌లో గామా సీఈవో సౌరబ్‌ కేసరి, వైభవ్‌ జ్యువెలర్స్‌ ఎండి రాఘవ్‌, జ్యూరీ సభ్యులు, దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌, హీరోయిన్స్‌ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్‌, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు. ‘గామా’ సీఈవో సౌరబ్‌ కేసరి మాట్లాడుతూ, ‘ఇది కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ఈవెంట్‌ కాదు. మా నాన్న (త్రిమూర్తులు)కి కళాకారులపై ఉన్న అభిమానంతో ఈ ‘గామా’ అవార్డ్స్‌ నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్‌గా, అలాగే ఇతర దేశాల్లోను ‘గామా’ అవార్డ్స్‌ ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం. దుబాయ్‌లో ఉన్న తెలుగు వారితో పాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాం’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad