ప్రతిష్టాత్మక ‘గామా’ (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) పురస్కారాలకు సర్వత్రా మంచి క్రేజ్ ఉంది. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో 5వ ఎడిషన్ ‘గామా’ వేడుకలు దుబారులోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ అవార్డుల వేడుక జరిగింది.’గామా’ అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డి, సంగీత దర్శకులు కోటి, దర్శకులు బి.గోపాల్ వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు ‘గామా’ అవార్డులను బహుకరించారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ‘గామా’ బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది. బెస్ట్ హీరోగా అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్), బెస్ట్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్), బెస్ట్ మూవీ ‘పుష్ప 2’ (మైత్రి మూవీ మేకర్స్ (యలమంచిలి రవి, నవీన్ యెర్నేని), బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ (పుష్ప 2), బెస్ట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898 ఏడి), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2), బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్), బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్), బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర), బెస్ట్ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీిమేల్ : మంగ్లీ,
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జా, బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క), బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్) ‘గామా’ అవార్డులను సొంతం చేసుకున్నారు.
దుబాయిలో వైభవంగా గామా అవార్డ్స్ వేడుక
- Advertisement -
- Advertisement -