Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా గంధమల్ల అశోక్

కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా గంధమల్ల అశోక్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.బుధవారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతనంగా నియమితులైన మండల,పట్టణ కమిటీలు సమిష్టి భావంతో పనిచేయాలని సూచించారు.

గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా నాయకులు పనిచేయాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ నాయకులు,కార్యకర్తలపై ఉందన్నారు ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపడంలో కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొంటూ, నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసి ఆలేరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -