జీ స్టూడియోస్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘గాంధీ టాక్స్’కు సంబంధించి విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మూవీ ఈనెల 30న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌గా ‘గాంధీ టాక్స్’ రూపొందింది. కథను వివరించటానికి మాటల కంటే నిశ్శబ్దం బలమైన అంశంగా నిలుస్తోంది. ఇది సినీ ప్రపంచంలో ధైర్యమైన, సృజనాత్మకమైన అడుగు అని మేకర్స్ తెలిపారు. సినిమాను ఎంత గ్రాండియర్‌గా, ఎలాంటి సౌండ్‌తో రూపొందించారంటూ లెక్కలు వేసే నేటి రోజుల్లో ఈ సినిమా తన సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా, భావోద్వేగాలతో చెప్పబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి నటీనటులు నటించారు. వీరందరూ తమ హావభావాలతో, నటనతో స్టోరీని అందరికీ తెలియజేస్తున్నారు.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి వంటి స్టార్స్ ఈ సైలెంట్ ఫిల్మ్‌లో నటించటానికి ఒప్పుకున్నారంటే సినిమా అనేది నటన ఆధారిత సినిమా అని కూడా నిరూపించే ప్రయత్నం చేయటమే. ఇది నిజంగా అతి పెద్ద ఛాలెంజ్. రొటీన్‌కు భిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వీరి తీరు వారి సినిమా అంటే వారికున్న ప్యాషన్‌ను తెలియజేస్తోంది. అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ వంటి స్టార్స్ పాత్రల భావాన్ని, సన్నివేశాల డెప్త్‌ను మాటలు లేకుండా హావభావాలతో కథను నెరేట్ చేయటంలో ప్రత్యేకతను చూపిస్తుంటారు. సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన ఈ చిత్రానికి ఎమోషనల్ వాయిస్‌గా నిలుస్తున్నారు. మాటలు లేకుండా రూపొందుతోన్న ఈ సినిమాకు రెహమాన్ సంగీతం నెరేటర్‌గా మారుతూ సినిమాలోని డెప్త్‌ను ప్రేక్షకులకు తెలియజేయనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ బెలేకర్ మాట్లాడుతూ, ‘నిశ్శబ్దం అనేది శక్తివంతం అని నమ్మి ఈ సినిమాను రూపొందించాం. శతాబ్దంగా ఇండియన్ సినీ మేకర్స్ పలు రకాలైన కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి కళలో నటన, ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని సినిమా చేయాలనుకున్నాం. నటీనటులు దీనికి ఈ కొత్త ప్రయత్నంలో భాగం కావటానికి ముందుకు రావటంతో పాటు సున్నితమైన భావాలను చక్కగా పలికించారు. అదే సమయంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీతం.. సినిమా కథను చెప్పే వాయిస్‌గా మారింది. జీస్టూడియోస్, మీరా చోప్రా సహకారంతో ధైర్యంగా, నిజాయతీగా కొత్త ప్రయత్నాన్ని చేశాం’ అని అన్నారు. సినిమా సాంప్రదాయాలను సవాల్ చేసేలా, కొత్తదనంతో ప్రతిష్టాత్మకంగా కథను చెప్పేలా ఉండే సినిమాలకు మద్ధతు ఇచ్చే నిబద్ధతను జీ స్టూడియోస్ మరోసారి ఈ ప్రయత్నంతో తెలియజేసింది.
‘గాంధీ టాక్స్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



