Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు 

ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి లతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. వివిధ గ్రామాలలోని శోభాయాత్రలో యువకులు, పెద్దలు చిన్నారులు సంబురంగా పాల్గొన్నారు. కొన్ని మండపాలలో లడ్డును వేలంపాట నిర్వహించగా, మరికొన్ని చోట్ల అన్నదానం కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించారు.నేడు చంద్రగ్రహణం ఉన్నందున నిమజ్జన ఏర్పాట్లను ముమ్మారం చేసినారు. పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు ఫైర్ హెల్త్ డిపార్ట్మెంట్ల వారు అందుబాటులో ఉన్నారని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. పోలీస్, విద్యుత్, మత్స్యశాఖ అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణానికి చెందిన డీకే ఆర్ కన్సల్టెంట్ అధినేత డీ కే రాజేష్ కుటుంబ సభ్యులు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad