నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరిగాయి. శనివారం 11వ రోజు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మండల కేంద్రంలోని శత్కరి గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఇందిరానగర్ కాలనీలో గల గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మండపాల వద్ద ఘనంగా సత్కరించారు. శేత్కరి గణేష్ మండల్ వద్ద ఎమ్మెల్యేకు శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ కమిటీ చైర్మన్ సందుర్వారి హనుమాన్లు ఘనంగా సన్మానించగా, ఆ తర్వాత ఇందిరానగర్ కాలనీలో గల గణేష్ మండల నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి పటేల్, హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, పట్నాల రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గణేష్ మండల నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
