నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఎల్లలింగ కురుమ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం గ్రామంలోని విధుల గుండా బాజా బజంత్రిల మద్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శోభాయాత్రని ఉల్లాసంగా , ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామస్తులకు మహా ప్రసాదం వితరణ చేయడం జరిగింది. యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని గణేష్ నిమజ్జన కార్యక్రమంలో తమ వంతుగా ఆట, పాటలతో నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు. జుక్కల్ ఎస్సై , సిబ్బంది పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాలలో శాంతిభద్రతలకు ఎటువంటి విగాతం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఎల్లలింగ కురుమ సంఘం వినాయక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఒగ్గుడోలతో గణేష్ నిమజ్జన శోభాయాత్ర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES