నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా నల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు సతీ సామెతoగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పూజలో పాల్గొన్న అనంతరం నిమజ్జల ఏర్పాట్ల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక మండపాల వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనను చేసుకోవాలని తెలిపారు. ఊరేగింపులో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి నిమజ్జనం చేసే వద్ద జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం పూజారి వెంకటేశ్వర శర్మ శ్రీను సంతోష్ నాగరాజు నాగన్న రమేష్ మహేష్ తోపాటు కొంతమంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES