- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలో మద్దికుంట, రెడ్డిపేట్, రామారెడ్డి, పోసాని పేరుతో పాటు ఉప్పల్వాయి తదితర గ్రామాల్లో శుక్రవారం గణేష్ శోభాయాత్ర కొనసాగింది. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో ఘనపయ్యను పూజించి, భజనలతో, యువకుల నృత్యాలతో, కేరళ డప్పు వాద్యాలతో శోభాయాత్ర ఘనంగా ముగిసింది. స్థానిక ఊర చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.
- Advertisement -