Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంగ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్ కు రిమాండ్‌

గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్ కు రిమాండ్‌

- Advertisement -

అమెరికా నుంచి ఢిల్లీకి తరలించిన ఎన్‌ఐఏ
న్యూఢిల్లీ : ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక నిందితుడైన అన్మోల్‌ బిష్ణోయ్ ను అమెరికా డిపోర్ట్‌ చేయగా, ఎన్‌ఐఏ అధికారులు అతనిని బుధవారం భారత్‌కు తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరిని తీసుకొచ్చిన ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యిందని అధికారులు తెలిపారు. అతనితోపాటు మరో 199 మందిని కూడా అమెరికా డిపోర్ట్‌ చేసింది. వారిలో ఇద్దరు పంజాబ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉండగా, మరో 197 మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు కావడం గమనార్హం.

పటియాలాహౌస్‌ కోర్టులో హాజరు
అమెరికా నుంచి తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్ ను ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపర్చగా..కోర్టు రిమాండ్‌ విధించింది. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోరు తమ్ముడే ఈ అన్మోల్‌ బిష్ణోయ్. గతేడాది ఏప్రిల్‌ నెలలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులకు బాధ్యత వహిస్తూ స్వయంగా అతడే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం. దీనితో ముంబయి పోలీసులు అతనిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

అన్మోల్‌ బిష్ణోయ్ చాలా కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అయితే మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు అన్మోల్‌ నకిలీ పత్రాలు ఉపయోగించి దేశం దాటి వెళ్లాడని నిఘా వర్గాలు గుర్తించాయి. అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 వరకు కేసులు నమోదు అయ్యాయి. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

ఉగ్రవాద సంస్థల జాబితాలోకి బిష్ణోయ్ గ్యాంగ్‌
అంతకుముందు, ఇటీవల నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకొని భయం, బెదిరింపు వాతావరణాన్ని సష్టిస్తున్నారంటూ లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. తమ దేశంలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -