నవతెలంగాణ హైదరాబాద్: జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హనుమాన్ టెంపుల్ వద్ద గంజాయి తాగుతున్న వారిని ఇద్దరు మహిళలు నిలదీయడంతో వారిపై దాడి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్లలోని హనుమాన్ టెంపుల్ వద్ద సోమవారం రాత్రి ఇద్దరు యువకులు పవన్ కల్యాణ్ (20), సంఘీ (20) గంజాయి తాగుతున్నారు. ఇది గమనించిన అదే కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు వారిని నిలదీశారు. దీంతో గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. మమ్మల్నే అడుగుతావా అంటూ ఇద్దరు మహిళలను విచక్షణారహితంగా చితకబాదాడు. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు అక్కడికి వచ్చి వారిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా తమ కాలనీలో గంజాయి బ్యాచ్ అరాచకాలను అరికట్టాలని, తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.



