నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి (46) గ్రామ శివారులో రైలు పట్టాల ప్రక్కన గల తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సాయి రెడ్డి తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రోజున సమయం 04.40 కిలోమీటర్ నెంబర్ 484/8-9 ఇందల్ వాయి సిర్నపల్లి రైల్వే స్టేషన్ల గుర్తు తెలియని రైలు రాకను గమనించకుండా రైలు పట్టాలు దాటుటకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్ హనుమాన్లు దర్యాఫ్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
రైలు ఢీకొని గన్నారం వాసి మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES