Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణపతి బప్పా మోరియా… కావలయ్యా యూరియా

గణపతి బప్పా మోరియా… కావలయ్యా యూరియా

- Advertisement -

– రైతులకు యూరియా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం…
– రాయపోల్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ధర్నా
నవతెలంగాణ- రాయపోల్

గణపతి బప్పా మోరియా కావలయ్యా యూరియా… రైతులకు యూరియా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్, యూరియా కావాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆగ్రహంతో నినాదాలు చేస్తూ యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. గత మూడు,నాలుగు రోజులుగా ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన రైతులు సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో యూరియా కోసం ధర్నా చేపట్టారు. రెండు బస్తాల యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.తెల్లవారకముందే యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్ లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యాయి. పత్తి, మొక్కజొన్న పంటలకు యూరియా అత్యవసరమైంది. యూరియా కోసం పొద్దున్నే లేచి కడుపు మార్చుకొని వచ్చి పరుగులు పెడుతూ బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. ఇలా వారం రోజుల నుంచి రైతులు తిరుగుతున్న యూరియా దొరకడం గగనంగా మారిందని పంటలకు యూరియా వేసే తరుణంలో ప్రభుత్వం నిబంధనలు విధించి ఒక రైతుకు ఒక, రెండు యూరియా బస్తాలు ఇవ్వడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. మండలానికి సరిపడా యూరియా అందించి రైతులు సాగుచేసిన పంటలను కాపాడుకునేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు.పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో రాయపోల్ ఎస్ఐ కుంచం మానస, ఏవో నరేష్ ధర్నా వద్దకు చేరుకొని ఉన్నత అధికారులతో మాట్లాడి యూరియా తెప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad