- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని అన్నారంలో గట్టు మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కులాలకు అతీతంగా బోనాలతో నైవేద్యాన్ని సమర్పించారు. ఎడ్లబండ్ల ప్రదర్శన అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్శకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, వివిధ సంఘాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



