నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గౌరవెల్లి ప్రాజెక్టుకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న పేరు పెట్టాలని రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ,జిల్లా గ్రంధాలయ చైర్మన్ లింగమూర్తి అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మ వెంకన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుకి బీజం పడింది బొమ్మ వెంకన్న కృషివలనేనని కొనియాడారు.ఆ ప్రాజెక్టుకి బొమ్మ వెంకన్న పేరు పెట్టాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ,డిసిసి కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టుకు బొమ్మ వెంకన్న పేరు పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



