Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గౌస్ కొండల స్వచ్ఛ సర్వేక్షన్...

గౌస్ కొండల స్వచ్ఛ సర్వేక్షన్…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పోచంపల్లి మండలంలోని గౌస్ కొండ  గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షన్ 2025  సర్వేలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ సంస్థలు అయిన గ్రామపంచాయతీ కార్యాలయము, ప్రాథమిక  పాఠశాల, అంగన్వాడి కేంద్రం, తడి ,పొడి చెత్త నిర్వహణ, పారిశుద్ధ అలవాట్ల పై సర్వే చేసినట్లు ఎంపీడీవో ఆర్ భాస్కర్ తెలిపారు.

 గ్రామంలోని స్వచ్ఛభారత్ లబ్ధిదారుల గృహాలను సందర్శించి వారి యొక్క మరుగుదొడ్ల వినియోగము, గృహాలకు సంబంధించిన తడి చెత్త ,పొడి చెత్త మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణ సంబంధించిన ప్రశ్నావళికి సంబంధించి సర్వేను నిర్వహించమన్నారు. వనజ, జుబేదా బేగం  సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీవో మజీద్, ఏపీవో  కృష్ణమూర్తి, జిల్లా ఎస్ బి ఎం కోఆర్డినేటర్స్ మురళి,  టెక్నికల్ అసిస్టెంట్ మాధవి,  పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad