Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పాపన్న పోరాట స్ఫూర్తితో గీతా కార్మికులు కాంగ్రెస్ కు అండగా ఉండాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

పాపన్న పోరాట స్ఫూర్తితో గీతా కార్మికులు కాంగ్రెస్ కు అండగా ఉండాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో నియోజకవర్గంలోని గీతా కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలో గల సర్వాయి పాపన్న కాంస్య విగ్రహం వద్ద పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాపన్న పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.

నియోజకవర్గంలోని గీతా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, గీతా కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గీతా కార్మికులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గీత కార్మికులకు భవనం నిర్మించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 2023 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలకు చోటు లేదని, వాటికి స్వస్తి పలికామని తెలిపారు. గీత కార్మికులు సోదర భావంతో ఐక్యమత్యంగా ఉండాలని సమస్యలను సాధించుకోవాలని సూచించారు. గీతా కార్మికుల వృత్తి దినదిన గండంగా ఉంటుందని చెట్టు ఎక్కి క్షేమంగా దిగేంతవరకు ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన గీతా కార్మికులకు, వృత్తిలో గాయపడిన గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియా సకాలంలో అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అర్హులైన గీతా కార్మికులకు పెన్షన్ అందే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గీతా కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి మద్దతు ఇవ్వాలని సూచించారు. వార్డు మెంబర్ మొదలుకొని జడ్పిటిసి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని అన్నారు. బహుజన రాజ్యాధికారం కోసమే పాపన్న పోరాటం నిర్వహించారని, ఆ పోరాట స్ఫూర్తితో గీతా కార్మికులు ఐక్యంగా ఉండాలని సూచించారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని గతంలో గీతా కార్మికులు కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టే విధంగా  కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు గిరగాని కుమారస్వామి గౌడ్, మాటూరి యాకయ్య, బీసు లలిత, మొలుగూరి యాకయ్య గౌడ్, బొమ్మగాని భాస్కర్ గౌడ్, నలమాస రమేష్ గౌడ్, కమ్మగాని నాగన్న గౌడ్, మూల మహేష్ గౌడ్, రాపాక సత్యనారాయణ, ఎర్రబెల్లి రాఘవరావు, చిలువేరు కృష్ణమూర్తి, పెనుగొండ రమేష్, మారం శ్రీనివాస్, వీరమనేని యాకాంతరావు, ఎండి మదర్, బండిపెళ్లి మనమ్మ, చిట్యాల శ్వేత లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad