- Advertisement -
ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ చుట్టుపక్కల ఈనెల ఆరో తేదీన గణేష్ నిమజ్జనం జరగనుంది. దీంతో ఈనెల ఆరో తేదీన రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్-సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సాధారణ సెలవు ప్రకటిస్తున్నట్టు తెలిసారు. వచ్చేనెల రెండో శనివారం ఆయా జిల్లాల్లో పనిదినంగా ఉంటుందని స్పష్టం చేశారు.
- Advertisement -