Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంజూలై 9న సార్వత్రిక సమ్మె..

జూలై 9న సార్వత్రిక సమ్మె..

- Advertisement -

నో వర్క్ నో పే  కాంటాక్ట్ కార్మికుల పెనాల్టీ రద్దు చేయాలి 
నవతెలంగాణ – మణుగూరు
జులై 9 సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న కార్మికులకు నో పే నో వర్క్ గా గుర్తించి పర్చేస్ మరియు ఫారెస్ట్ విభాగాలలో కాంట్రాక్ట్ కార్మికులకు పెనాల్టీ రద్దు చేయాలని శనివారం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా ఎస్ ఓ టు జి ఎం బి శ్రీనివాసచారి కి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ నేపథ్యంలో నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై  తొమ్మిది దేశవ్యాప్త సమ్మె పిలుపు ఆపై మణుగూరులో కూడా కాంట్రాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారనీ అన్నారు. అలాగే పెనాల్టీ విధించవద్దని ఏరియా అకౌంట్ సెక్షన్ కి తగు విధంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని జిఎం గారిని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad