Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'కత్తందుకో జానకి..' సందడి షురూ

‘కత్తందుకో జానకి..’ సందడి షురూ

- Advertisement -

బన్నీ వాస్‌ నూతన నిర్మాణ సంస్థ బి.వి.వర్క్స్‌ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌, వైరా ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. కళ్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు ఓరు, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో నిహారిక ఎన్‌.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్‌ ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి గీతం ‘కత్తందుకో జానకి’ గీతావిష్కరణ అమలాపురంలోని కిమ్స్‌ కాలేజ్‌లో జరిగింది. రెబల్‌ స్టార్‌ కష్ణంరాజు ఐకానిక్‌ డైలాగ్‌ ‘కత్తందుకో జానకి’ని తీసుకొని ఈ తరం మెచ్చేలా అద్భుతమైన పాటగా మలిచారు. ఆర్‌.ఆర్‌. ధవన్‌ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad