Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీటీ రోడ్డు, బ్రిడ్జి మంజూరు చేయించండి ..

బీటీ రోడ్డు, బ్రిడ్జి మంజూరు చేయించండి ..

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక
ఏళ్లుగా తమ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మండల పరిధిలోని రాజక్కపేట నుంచి మధిర గ్రామమైన ఎల్లాపూర్ (ఎస్సీ కాలనీ ) వరకు నూతన రోడ్డు, బ్రిడ్జిని మంజూరు చేయాలని డీబీఎఫ్ జిల్లా అధ్యక్షులు భీమ్ శేఖర్ కోరారు.

వర్షాకాలంలో నిత్యవసరాలకు, వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సీతక్కతో ఫోన్లో మాట్లాడగా.. త్వరలోనే ఈ రెండు గ్రామాల సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య చెప్పారన్నారు. ఈ సందర్భంగా వారికి భీమ్ శేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad